మహేశ్ బాబు ఉగాది కానుక..
- March 18, 2018
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న భరత్ అను నేను చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కైరా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా అభిమానుల కోసం చిత్రయూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక హోదాలో సంప్రదాయ పద్ధతిలో పండుగను ఎలా జరుపుకుంటారో ఈ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న మహేశ్ బాబు పంచెకట్టుతో అదరగొట్టారు. రాజకీయ నేపథ్యంలో మహేశ్‌బాబు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం భరత్ అను నేను. వీరిద్దరి కాంబినేషనలో గతంలో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. భరత్ అను నేను చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







