అలరించనున్న రంభ
- March 21, 2018
చెన్నై: 1990లలో తెలుగు, తమిళ పరిశ్రమను తన అందం, అభినయంతో మెప్పించిన నటి రంభ. రజనీకాంత్, కమల్, చిరంజీవి, విజయ్, అజిత్, కార్తిక్, ప్రభు.. ఇలా పెద్ద హీరోలతో నటించి మెప్పించారు. 15 ఏళ్ల క్రితమే నటనకు కాస్త బ్రేక్ ఇచ్చారు రంభ. పెళ్లి తర్వాత భర్త, పిల్లలతో పాటు కెనడాలో స్థిరపడ్డారు. పలు కారణాలతో మళ్లీ చెన్నైకి వచ్చి కొన్ని టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా సీనియర్ నటీమణులు రీ ఎంట్రీ ఇస్తే తల్లి పాత్రల్లోనే అధికంగా కనిపిస్తారు. కానీ రంభ అందుకు భిన్నమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. తాజాగా ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది ఎలాంటి పాత్ర అనేది ఇంకా స్పష్టం కాలేదు. తెలుగులోను అవకాశాల కోసం రంభ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







