ట్రక్కుని ఢీ కొన్న బస్సు ఘటనలో ఇద్దరు మృతి, 26 మందికి గాయాలు
- March 21, 2018
మక్కా : 50 మంది ప్రయాణీకులతో వెళుతున్నబస్సు ఒక ట్రక్కుని ' ఢీ ' కొట్టిన ఘటనలో మక్కాలోని జామౌమ్ సమీపంలోని అల్-క్వైయ్యా రహదారిపై కరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మేజ్ నయిఫ్ అల్-షరీఫ్ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ సహాయకుడి తో సహా చనిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినపుడు 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు, వీరినందరిని మక్కాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. బస్సు లోపల ప్రయాణికులు చిక్కుకున్నట్లు సమాచారం పొందిన తర్వాత సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాదస్థలానికి చేరుకొన్నారు. ఇనుమును కత్తిరించే సాధనాలను ఉపయోగించి పలువురిని వెలుపలకు తీసి రక్షించారు. వీరికి ప్రథమ చికిత్స అందించినట్లు ఆరోగ్య వ్యవహారాలు మరియు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీల బృందాల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టినట్లు ఆ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







