మలేషియాలో 'నిన్నే చూస్తు'
- March 21, 2018
నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్, హేమలత ప్రధాన తారాగణంలో రూపొందుతున్న చిత్రం నిన్నే చూస్తు. సుమన్, భానుచందర్, సుహాసిని ఇతర ముఖ్యపాత్రధారులు. కె.గోవర్థనరావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. హేమలతా రెడ్డి నిర్మాత. ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. తాజాగా మూడవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల నిన్నే చూస్తు అనే పాటను మలేషియాలో చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ మా సినిమాకు టైటిల్ సాంగ్ ప్రత్యేకం. సంగీత దర్శకుడు రమణ్ రాథోడ్ మంచి బాణీలు అందించారు. మంచి కుటుంబకథతో తీస్తున్న సినిమా ఇది. సీనియర్ నటులు నటించడం ఆనందంగా ఉంది. త్వరలో షూటింగ్ పూర్తిచేస్తాం అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం రమణ్ రాథోడ్, ఛాయాగ్రహణం ప్రసాద్ ఈదర, మాటలు కరణ్ గోపిని, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కె.గోవర్థన్ రావు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!