ఖతార్‌లో చిక్కుకున్న 100మంది భారతీయులు, అందులో 20మంది తెలుగు కార్మికులు
- March 29, 2018
దోహా: గత కొద్ది నెలలుగా సుమారు వందమంది భారతీయులు ఖతార్‌లో చిక్కుకుపోయారు. వీరిలో 20మంది తెలుగువారు ఉన్నారు. నిర్మాణ కంపెనీ మూతపడటంతో భారతీయులతోపాటు నేపాల్ కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు.
నాలుగేళ్లుగా పనిచేస్తున్న కంపెనీ మూతడటంతో అక్కడి భారతీయ కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అంతేగాక, దోహా, ఖతార్‌లోని ఇతర కంపెనీల్లో పనిచేసేందుకు వారిని పంపించేసింది ఆ కంపెనీ.
దేవరాజ్ అనే కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ.. తాము నాలుగు నెలలుగా జీతాలు పొందడం లేదని చెప్పాడు. కోర్టులు తమకు న్యాయం చేయాలని చెప్పినప్పటికీ జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత దౌత్య అధికారులు తగిన విధంగా స్పందించడం లేదని చెప్పాడు. భోజనం, నివాసానికి కష్టాలు పడుతున్నామని వాపోయాడు.
తాము పనిచేస్తున్న కంపెనీ తమ పాస్ పోర్టులను ఇవ్వకపోవడంతో తాము అక్కడ అక్రమ వలసదారులుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. నిజామాబాద్, కామారెడ్డి, ఇతర తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులే ఎక్కువగా ఉన్నారని తెలిపాడు.
తెలంగాణ గల్ఫ్ మైగ్రేంట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ బసంత్ రెడ్డి కార్మికుల కష్టాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారిని ఎలాగైన స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఆ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కాగా, స్వదేశంలోని కార్మికుల కుటుంబసభ్యులు, బంధవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తమవారిని వెంటనే స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!