ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫత్తా అల్ సిసి
- March 29, 2018
కైరో : ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫత్తా అల్ సిసి రెండోసారి ఎన్నికయ్యారు. సోమవారం నుండి మూడు రోజుల పాటు సాగిన పోలింగ్లో ఆయన ఘన విజయం సాధించారు. దాదాపు 92శాతం ఓట్లు పోలయ్యాయని ప్రభుత్వ మీడియా గురువారం తెలిపింది. దాదాపు 6కోట్ల మంది రిజిస్టర్ అయిన ఓటర్లు వుండగా వారిలో 2.3కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికార మేనా వార్తా సంస్థ తెలిపింది. సిసి ఏకైక ప్రత్యర్థి, అల్ గద్ పార్టీ చీఫ్ మొసా ముస్తఫాకు కేవలం మూడు శాతం ఓట్లు లభించాయి. అయితే అధికారికంగా ఫలితాన్ని ఏప్రిల్ 2వ తేదిన ప్రకటిస్తారు. ఎన్నికల బరిలోని కొంతమంది అభ్యర్ధులను అరెస్టు చేయడమో లేదా అడ్డగించడమో జరగడం, సిసి ప్రత్యర్థి ముస్తఫా ఒక్కరే బరిలో మిగలడంతో సిసి విజయావకాశాలు పెరిగాయి. పోలింగ్ కేంద్రాల వెలుపల బారులు తీరి నిలుచున్న ఓటర్లు తనకు గర్వకారణమని, మన జాతి గొప్పతనానికి నిదర్శనమని సిసి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







