రజనీ బర్త్ డే కు కబాలి థ్రిల్లింగ్ పోస్టర్ ని రిలీజ్..
- December 02, 2015
సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం సౌత్ ఇండియాలోనే కాక విదేశాలలోను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.రజనీ సినిమా అంటే పడి చచ్చి పోయే ఫ్యాన్స్ ఆయన బర్త్ డే వేడుకను ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో మనందరికి తెలిసిందే.అయితే ఇంకో పది రోజుల్లో రజనీ బర్త్ డే సమీపిస్తుండడంతో ఫ్యాన్స్ తమ తమ ఏర్పాట్లలో మునిగిపోయారు. రజనీ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ఫ్యాన్స్ ను ఆనందపరిచేందుకు రజనీ తన బర్త్ డే కానుకగా డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం కబాలి చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్న రజనీ తన బర్త్ డే కు కబాలి సినిమాకు సంబంధించి ఓ థ్రిల్లింగ్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారట.ఇంక అదే రోజు మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ రోబోకి సీక్వెల్ గా శంకర్ డైరెక్షన్లో చేయనున్న రోబో 2ను అధికారికంగా లాంఛ్ చేయనున్నారట.డిసెంబర్ రెండో వారంలో కబాలి సినిమా పూర్తి కానుండడంతో రోబో 2 ను డిసెంబర్ 18 నుండి పట్టాలెక్కించనున్నట్టు సమాచారం
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







