15 ప్లోర్లున్న బిల్డింగ్ 10 సెకన్లలో నేలమట్టం
- March 29, 2018
ఏదైనా కట్టాలంటే కష్టం గానీ కూలగొట్టాలంటే ఎంత సేపు. మరి 15 అంతస్థుల భవనాన్ని కట్టడానికి ఎంత మంది పని చేసి ఉంటారు. ఎన్ని నెలలు పని చేసి ఉంటారు. అదే భవనాన్ని కూల్చేయాలంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తే 10 సెకన్లు చాలంటుంది చైనా. చెంగ్డూ సిటీలోని రద్దీగా ఉన్న ఓ ఏరియాలో 15 అంతస్థుల భవనం ఉంది. అది చాలా ఏళ్ల క్రితం కట్టిందని దాన్ని కూలగొట్టి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పెద్ధ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకున్నాడు ఆ బిల్డింగ్ యజమాని. అనుకున్నదే తడవుగా రెస్క్యూటీమ్‌కి కబురు చేశారు. వారు వచ్చి కేవలం 10 సెకన్లు మాత్రమే అంటే కన్ను మూసి తెరిచే లోగా బిల్డింగ్‌ని కూల్చేశారు సిబ్బంది. 15 అంతస్థుల బిల్డింగ్ ఒక్కసారిగా నేలమట్టం కావడంతో దుమ్ము బాగా లేచింది. చుట్టుపక్కల మొత్తం దట్టమైన పొగలా అలుముకుంది. వెంటనే రెస్క్యూ టీమ్ నీటితో తడిపి దుమ్ముని కాస్త తగ్గించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!