మరో 24 గంటల్లో భూమిని ఢీ కొట్టనున్న స్పేస్ ల్యాబ్ టియాంగ్‌గాంగ్-1
- April 01, 2018
అంతరిక్షంలో గతి తప్పి భూమి వైపు దూసుకొస్తున్న స్పేస్ ల్యాబ్ టియాంగ్‌గాంగ్-1 రానున్న 24 గంటల్లో భూమిని ఢి కొట్టనున్నట్లు చైనా స్పేస్ సెన్సెస్ అకాడమీ ఓ ప్రకటనలో పేర్కొంది. వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం అది గంటకు 26 వేల కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంని వెల్లడించింది. దాదాపు 8.5 టన్నుల బరువున్న టియాంగ్‌గాంగ్-1 భూమిని తాకడం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
టియాంగ్‌గాంగ్-1 ప్రస్తుతం ప్రయాణిస్తున్న కక్ష్య ఆధారంగా అది 43 డిగ్రీల ఉత్తర, 43 డిగ్రీల దక్షిణ అక్షాంశాంల మధ్య ఉందని తెలిపింది. దీన్ని బట్టి న్యూజిలాండ్, అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కడైనా అంతరిక్ష నౌక కుప్పకూలొచ్చని వివరించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ టియాంగ్‌గాంగ్-1 కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొంది.
చైనా తొలి అంతరిక్ష పరిశోధన కేంద్రం టియాంగ్‌గాంగ్-1ను చైనా 2011లో ప్రయోగించింది. భవిష్యత్తులో సొంతంగా అంతరిక్షంలో పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు ట్రయల్‌గా ఈ తాత్కాలిక స్పేస్‌ల్యాబ్‌ను పంపింది. 2016లో టియాంగ్‌గాంగ్-1 చైనా అదుపు తప్పింది. అప్పటినుంచి అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ భూమి వైపునకు ప్రయాణిస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







