గుడ్ కండక్ట్ సర్టిఫికెట్‌ని సస్పెండ్ చేసిన యూఏఈ
- April 01, 2018
ఫిబ్రవరి 4న గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ విషయమై జారీ చేసిన ఆదేశాల్ని, యూఏఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. యూఏఈకి ఉద్యోగ నిమిత్తం వచ్చేవారు తమ స్వదేశం నుంచి పోలీస్ ద్వారా గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావడం తప్పనిసరి అని ఫిబ్రవరి 4న దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ విధానంపై విమర్శలు రావడం, అనేక అనుమానాలు తలెత్తడంతో యూఏఈ ప్రభుత్వం 'సస్పెండ్' నిర్ణయం తీసుకుంది. గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి నిర్ణయం పోస్ట్‌పోన్ అయ్యిందనీ, తదుపరి నోటీసు వచ్చేదాకా ఈ నిర్ణయం అమల్లో వుంటుందని మినిస్ట్రీ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. కొత్త రూల్కి సంబంధించి ఎంబసీలు తీవ్ర గందరగోళంలో పడ్డాయి. ఈ విషయాన్ని ఎంబసీలు, యూఏఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాయి. దాంతో యూఏఈ ప్రభుత్వం గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి నిర్ణయాన్ని పోస్ట్‌పోన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







