పసిఫిక్ మహాసముద్రంలో కూలిన టియాంగంగ్‌-1

- April 01, 2018 , by Maagulf
పసిఫిక్ మహాసముద్రంలో కూలిన టియాంగంగ్‌-1

చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగంగ్‌-1 పసిఫిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటలకు భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమై దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో కూలిపోయిందని చైనా అంతరిక్ష సంస్థ పేర్కొన్నట్టు ఆ దేశ వార్తాసంస్థతెలిపింది. అమెరికా సైన్యం కూడా ఈ వార్తను ధ్రువీకరించింది. టియాంగంగ్‌-1 స్పేస్‌ స్టేషన్‌ను చైనా 2011లో ప్రయోగించింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. సముద్రంలో కూలిపోవడంతో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com