చర్చీల్లో పేలుళ్ల కేసు... 36మందికి ఉరిశిక్ష
- April 11, 2018
కైరో : ఈజిప్టులోని రెండు చర్చీల్లో పేలుళ్లకు పాల్పడి 46 మందిని బలిగొన్న 36 మంది నిందితులు ఈజిప్టు మిలిటరీ కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులోని దోషులకు ఉరిశిక్ష విధించినట్టు బుధ వారం సంచలన తీర్పు వెలువరిం చింది. ఈకేసులో దోషులుగా తేలిన వారందరికీ ఐఎస్‌తో సంబంధాలున్నాయని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. గతంలో వారు పాల్పడ్డ నేరాలను కూడా పరిగణనలోకి తీసుకొని తీర్పు వెలువరించినట్టు తీర్పు వెలువరించే సమయంలో జడ్జీ పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈజిప్టులోని అలెగ్జాండ్రియా, టాంటా చర్చిల్లో గతేడాది ఏప్రిల్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 46 మంది మృతి చెందగా, దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు 48మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. 36మందిపై కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. నిందితులకు ఉగ్రవాదంతో సంబంధాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఫాస్ట్‌ట్రాక్ మిలిటరీ కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. దోషులకు మరణదండ విధించినట్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఈజిప్టు ముఫ్తీ సూచనలు కూడా కోరింది. దోషులకు ఉరే సరి అని ముఫ్తీ సైతం వెల్లడించడంతో మరణశిక్ష దాదాపు ఖరారైనట్టే. ఈజిప్టు చట్టాల ప్రకారం..మరణదండన విధించిన ఖైదీల వివరాలు ముఫ్తీకి పంపుతారు. ఒకవేళ ఉరిశిక్ష విధించాల్సిన అవసరం ఉందని ముఫ్తీ సిఫారసు చేస్తే కచ్చితంగా అమలు చేస్తారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







