విమానం ఇంజన్లో పేలుడు
- April 18, 2018
న్యాయార్క్ : సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇంజన్పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, ఏడుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో విమానాన్ని ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపామని పేర్కొన్నారు. సౌత్‌వెస్ట్ విమానంలో ఎడమవైపున ఉన్న ఇంజన్ వైఫల్యం చెందడంతో పేలుడు సంభవించిందని జాతీయ రవాణా భద్రతా బోర్డ్ చైర్మన్ రాబర్ట్ సుమ్వాల్టో అన్నారు. న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయం నుండి విమానం ప్రయాణించిన గంటలోనే ఇంజన్లో పేలుడు సంభవించిందని, దీంతో ప్రయాణికులు భయానికి గురయ్యారని అన్నారు. విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







