ఆ మీడియా సంస్థలకు రూ.10 లక్షల జరిమానా
- April 18, 2018
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని కథువాలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన బాలిక వివరాలను బయటకు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు పది లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలిక వివరాలు బహిర్గతం కావడానికి కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహమే కారణమనే అభిప్రాయాలు వెలువడిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది.
ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం శుక్రవారం దేశంలోని పలు దిన పత్రికలు, టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసింది. నిర్భయ కేసులో సంయమనం పాటించిన మీడియా ఈ కేసులో ఎందుకు అలా చేయలేకపోయిందని ప్రశ్నించింది. సున్నితమైన అంశాల్లో మీడియా సంస్థలు నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
బాధితురాలి వివరాలు బహిర్గతం చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. బాధితురాలి వివరాలు బహిర్గతం చేసిన మీడియా సంస్థలు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఆ డబ్బును బాధితురాలి కుటుంబానికి కోర్టు అందేజేస్తుందని వెల్లడించింది. ఎవరైనా అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బహిర్గతం చేస్తే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







