రస్ అల్ ఖైమా:మోడ్రన్ యాంబియన్స్‌లో ట్రెడిషనల్ ఇఫ్తార్
- May 08, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మోడర్న్ అల్ ఫైరోజ్ రమదాన్ టెంట్ ఐలాండ్‌ని ప్రారంభిస్తోంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఈ కాంటెంపరరీ టెంట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. సముద్ర తీరంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇఫ్తార్ విందు ఎంతో ప్రత్యేకంగా వుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. జెడబ్ల్యు మారియట్ దుబాయ్ 5 స్టార్ సౌకర్యాలతో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తోంది. రమదాన్ సంప్రదాయాల్ని మోడ్రన్ యాంబియన్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. మెయిన్ డైనింగ్ ఏరియా, 10 ప్రైవేట్ మజ్లిస్ ఏరియాస్, పలు ప్రైవేట్ ఏరియాస్ (వీఐపీ విజిటర్స్ - కార్పొరేట్ బుకింగ్స్ కోసం) అందుబాటులో వుంటాయి. ఆర్‌ఎకెటిడిఎ సిఇఓ హైతమ్ మట్టర్ మాట్లాడుతూ, పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్ విందుని మరింత ప్రత్యేకంగా మలచేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సాయంత్రం 6.30 నిమిషాల నుంచి తెల్లవారుఝామున 2 గంటల వరకు సాధారణ రోజుల్లో అందుబాటులో వుండే ఈ యాంబియన్స్, వీకెండ్స్‌లో తెల్లవారు ఝాము 3 గంటల వరకు తెరచి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







