షార్జా:కారు ప్రమాదం, 8 ఏళ్ళ బాలుడి పరిస్థితి విషమం
- May 08, 2018
షార్జా:వేగంగా దూసుకెళ్తున్న కారు ఢీకొనడంతో 8 ఏళ్ళ బాలుడి పరిస్థితి విషమంగా మారింది. అల్ ధైద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎమిరేటీ వ్యక్తి కారుని నడుపుతుండగా, అరబ్ బాలుడు కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సూపర్ మార్కెట్‌కి వెళ్ళేందుకోసం రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా బాలుడ్ని వేగంగా దూసుకొస్తున్న కారు ఢీకొంది. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదం గురించిన సమాచారం అందగానే, పెట్రోల్ మరియు అంబులెన్స్‌ని తక్షణం సంఘటనా స్థలానికి పంపించారు. బాలుడి పరిస్థితి విషమంగా వుండడంతో హుటాహుటిన అల్‌ధైద్ ఆసుపత్రికి అతన్ని తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో బాలుడికి చికిత్స అందుతోంది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







