దుబాయ్‌లో తొలి ఫ్లోటింగ్ ఇఫ్తార్
- May 08, 2018
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్‌కి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఈసారి దుబాయ్‌లో ఫ్లోటింగ్ ఇఫ్తార్ ప్రధాన ఆకర్షణ కానుంది. క్వీన్ ఎలిబిబెత్ 2, ప్రత్యేకమైన ఇఫ్తార్ మరియు షురూర్‌ని ఆఫర్ చేస్తోంది. సంప్రదాయ మిడిల్ ఈస్టర్న్ ఫ్లేవర్స్‌ని రాయల్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్‌తో అతిథుల్ని ఆకట్టుకోనుంది. ఇఫ్తార్ బఫెట్ అనేది సన్‌సెట్ నుంచి రాత్రి 9 గంటల వరకు వుంటుంది. పెద్దలకు 250 దిర్హామ్‌ల ఖర్చుతో, పిల్లలకు 125 దిర్హామ్‌ల ఖర్చుతో ఇఫ్తార్‌ని ఆఫర్ చేస్తున్నారు. షుహూర్ బఫెట్ రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు అందుబాటులో వుంటుంది. దీని ధర పెద్దలకు 175 దిర్హామ్‌లు కాగా, పిల్లలకు 85 దిర్హామ్‌లు. 10 మంది నుంచి 450 మంది వరకు గ్రూప్ బుకింగ్స్‌ని సైతం క్వీన్ ఎలిజిబెత్ 2 ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలకు క్వీన్ ఎలిజబెత్ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







