వాట్సాప్‌లో ఆ మెసేజ్‌లను ఓపెన్ చేస్తే అంతే సంగతులు !
- May 08, 2018
ప్రముఖ ఇన్స్‌స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మెసేజ్ బాంబులను పంపుతున్నారు. ఏంటి వాట్సాప్‌లో బాంబ్ ఏమిటి అనుకుంటున్నార! అవును ఇది నిజం కొందరు ఇప్పుడు వాట్సాప్‌లో మెసేజ్ బాంబులను సెండ్ చేస్తున్నారు.ప్రతి రోజు కొన్ని కోట్ల మంది మెసేజ్‌లను ఫార్వార్డ్ చేస్తుంటారు . వాటిల్లో ఫన్నీ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలే అధిక సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి మెసేజ్ లను చదవడానికి మనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం. అయితే ఇదే విషయాన్ని ఆసరగా చేసుకొని హకెర్స్ మెసేజ్ బాంబులను పంపుతున్నారు. ఇవి చూడడానికి సాధరణ మెసేజ్‌లాగే కనిపించిన వాటిని ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాంగ్ అయి పనిచేయకుండా పోతాయి.
వీటిలో t-touch here ,this is very interesting.. అనే రెండు మెసేజ్ బాంబులు వాట్సాప్‌లో ఎక్కవుగా ఫార్వార్డ్ అవుతున్నాయి. వాటిని టచ్ చేస్తే అంతే సంగతులు.. వాట్సాప్ క్రాష్ అవుతుంది. ఈ మెసేజ్ లు సాధారణ మెసేజ్ లాగే కనిపించిన వాటికీ ఇన్విజిబుల్ క్యారెక్టర్లను ఫిక్స్ చేయడం వల్ల ఆ మెసేజ్‌లను ఓపెన్ చేయగానే ఫోన్ హ్యాంగ్ అవుతున్నట్లు నిపుణులు గుర్తించారు. కావున ఈ రెండు మెసేజ్‌లు ఏ తరహాలో వచ్చినా ఓపెన్ చేయవద్దని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







