గల్ఫ్‌కు వెళ్లిన వారి చెక్కులు కుటుంబ సభ్యులకు అందజేస్తాం:మహమూద్ అలీ
- May 08, 2018
హైదరాబాద్: గల్ఫ్‌కు వెళ్లిన వాళ్ల రైతుబంధు చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కాబోయే రైతుబంధు పథకం చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై మహమూద్ అలీ స్పందిస్తూ.. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేస్తారన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. పంట సాయం కింద రైతులకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకం కోసం బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రైతుబంధు పథకం కింద 58.06 లక్షల చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇందుకోసం రూ. 5,608.09 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..