హైదరాబాద్:ప్రయాణికులను ఇక్కట్లు పాలు చేసిన ఖతార్ ఎయిర్‌వేస్‌

- May 08, 2018 , by Maagulf
హైదరాబాద్:ప్రయాణికులను ఇక్కట్లు పాలు చేసిన ఖతార్ ఎయిర్‌వేస్‌

హైదరాబాద్:ఖతార్ ఎయిర్‌వేస్‌ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు చుక్కలు చూపించింది. హైదరాబాద్ నుంచి దోహా వెళ్లాల్సిన ప్రయాణికులంతా ఫ్లైట్ ఎక్కాక.. మూడున్నర గంటలు గడిచినా టేకాఫ్ తీసుకోలేదు. ఉదయం 3.15కి విమానం బయలుదేరాల్సి ఉన్నా.. ఆలస్యానికి కారణమేంటో చెప్పకుండా ఎయిర్‌వేస్ సిబ్బంది మూడున్నర గంటలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతా ఆన్‌బోర్డ్ అయ్యాక ఫ్లైట్‌ ఎందుకు బయలుదేరడం లేదో అర్థంకాక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. చివరికి ఆరుగంటల 50 నిమిషాలకు ఫ్లైట్ రద్దైనట్టు ప్రకటించారు. సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగిందని మొక్కుబడిగా ఓ ప్రకటన చేసింది ఖతార్ ఎయిర్‌వేస్.

హైదరాబాద్ నుంచి దోహా వెళ్లే ఫ్లైట్‌ QR 501లో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా దాదాపు మూడున్నర గంటలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలతో వెళ్లేవాళ్లకు ఎక్కువ ఇబ్బంది ఎదురైంది. చివరికిప్పుడు టెక్నికల్ సమస్యతో  ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో.. అందరినీ నోవాటెల్ హోటల్‌కు తీసుకెళ్లారు. దోహా నుంచి టెక్నికల్ టీమ్ వచ్చి సమస్య ఏంటో చూసి దాన్ని పరిష్కరిస్తే తప్ప విమానం బయలుదేరే పరిస్థితి లేదు. దీంతో.. ప్యాసింజర్లంతా మధ్యాహ్నం వరకూ వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. 

హైదరాబాద్ నుంచి దోహా వెళ్లాల్సిన ఫ్లైట్‌ సాంకేతిక కారణా ఫ్లైట్ తీవ్ర ఆలస్యం ప్రయాణికుల్లో అసహనం పెంచింది. ఉదయం 3 గంటల 15 నిమిషాలకే ప్యాసింజర్లు ఫ్లైట్ ఎక్కారు. 3 గంటలు గడిచినా ఇంకా రన్‌వై పైనుంచి ఫ్లైట్ కదలలేదు. మామూలుగా అయితే దోహాకి ఇక్కడి నుంచి నాలుగు గంటల నలభై నిమిషాల  సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోనే వెయిటింగ్‌తో ఆ సమయం గడిచిపోయింది. తిరిగి ఫ్లైట్ బయలుదేరడానికి మరికొన్ని గంటలు నిరీక్షించాల్సి వస్తోంది. 

సాధరణంగా ప్రయాణికులు ఆన్‌బోర్డ్ అయ్యాక కాసేపటికి ఫ్లైట్ బయలుదేరాలి. ఫ్లైట్ కండిషన్ బాగానే ఉందా లేదా అన్న చెకింగ్స్ అన్నీ అప్పటికే అయిపోతాయి. ఐతే, ఇవాళ అనూహ్యంగా 200 మంది ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కాక,  మరికాసేపట్లో బయలుదేరాలి అన్నప్పుడు టెక్నికల్ సమస్య గుర్తించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆ విషయాన్ని ప్రయాణికులకు చెప్పలేదు. గంటలకు గంటలు నిరీక్షిస్తున్నా కనీసం సిబ్బంది పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా నోవాటెల్‌కు చేరుకున్నారు. ఫ్లైట్ తిరిగి ఎప్పుడు బయలుదేరుతుంది అన్న దానిపై టెక్నికల్ టీమ్ చూసిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com