వైరస్ కలకలం: ప్రజల ప్రాణాలు తీస్తున్న 'నిఫా' వైరస్.. 15మంది మృతి!
- May 21, 2018
కేరళలోని కోజికోడ్ జిల్లాలో పెరంబాబ్రా ప్రాంతంలో విష జ్వరాలు ప్రబలాయి. ఇప్పటికే ఈ విష జ్వరాల కారణంగా 9 మంది మరణించారు. దాదాపు 26 మంది విషమపరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వీరి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు గుర్తు తెలియని వైరస్ సోకడంతో విష జ్వరాలు సోకాయని వైద్యులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం కేంద్రం సహయం కోరింది. మరణించిన వారిలో ఇద్దరికి నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మిగతా వారికి సోకిన వైరస్ గుర్తించడం కోసం శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. వ్యాధి సోకిన పందులు, ఇతర సంక్రమిత జంతువులు ద్వారా లేదా కలుషితమైన పండ్లు (గబ్బిలాలు సగం తినే పండ్లను తినడం) ద్వారా ఈ వైరస్ సోకుతుంది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







