'బాబు బంగారం' ...
- December 07, 2015
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పడిప్పుడే తిరిగి సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. కుర్ర హీరోల పోటీ పెరిగిపోవటంతో ఎలాంటి కథను ఎంచుకోవాలనే ఆలోచనలతో చాలా టైం తీసుకున్న వెంకీ, తాజాగా భలే బలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ సినిమాలో వెంకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు 'బాబు బంగారం' అనే టైటిల్ ను ఫైనల్ చేశారట. లక్ష్మీ, తులసీ లాంటి హిట్ సినిమాల తరువాత మరోసారి నయనతార వెంకటేష్ తో జోడి కడుతోంది. ప్రజెంట్ భారీ సక్సెస్ లతో మంచి ఫాంలో ఉన్న నయనతార హీరోయిన్ గా నటిస్తుండటం ఈ సినిమాకు కూడా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించి 2016 జూన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







