ట్రాఫిక్ కెమెరాలు చూస్తున్నాయ్ జాగ్రత్త
- December 07, 2015
వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, మొబైల్ ఫోన్‌ని వినియోగించినా దుబాయ్‌లో ట్రాఫిక్ కెమెరాలు పసిగట్టేస్తాయి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందించిన కెమెరాలను దుబాయ్‌లో ఇన్‌స్టాల్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతధికారులు వెల్లడించారు. గడచిన 11 నెలల్లో సుమారు51,891 కేసుల్ని గుర్తించామనీ, వీటిల్లో సీట్ బెల్ట్, మొబైల్ ఫోన్ అఫెన్సెస్ ఉన్నాయని కల్నల్ సైఫ్ అల్ మజ్రోయ్ చెప్పారు. ఇల్లీగల్ ఓవర్‌టేకింగ్,రాష్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల్నీ నెంబర్ ప్లేట్ల ఆధారంగా గుర్తించామని ఆయన అన్నారు. వాహనం ఎంత వేగంతో వెళ్ళినా,పసిగట్టగలిగే విధంగా కొత్త టెక్నాలజీతో కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు. వాహనదారులు కెమెరాలను గుర్తించి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. షేక్ జాయెద్ రోడ్‌లో 51 అధునాతన కెమెరాలను అమర్చగా, ప్రధాన కూడళ్ళ వద్ద 31కెమెరాలను అమర్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







