కారుతో ప్రమాదకర విన్యాసాలు: వ్యక్తి అరెస్ట్‌

- June 02, 2018 , by Maagulf
కారుతో ప్రమాదకర విన్యాసాలు: వ్యక్తి అరెస్ట్‌

మస్కట్:ఓ వ్యక్తి రోడ్డుపై ప్రమాదకర రీతిలో కారుతో విన్యాసాలు చేస్తూ, ప్రమాదానికి కారణమైన గటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనను తిలకించిన చాలామంది, కారు ప్రమాదానికి గురి కావడంతో డ్రైవర్‌ని రక్షించేందుకు ప్రయత్నించారు. ఓ దశలో కొందరు, ఆ వ్యక్తిని తప్పించుకునేందుకూ సహకరించారు. అయితే అల్‌ బతినా నార్త్‌ గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, వాహన యజమానిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది. ఈ ఘటనలో డ్రైవర్‌కి సహకరించిన వారిపైనా అభియోగాలు నమోదయ్యాయి. ప్రమాదకర విన్యాసాలకు సహకరించారన్న కోణంలో వారిపై కేసులు నమోదు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com