దోహా:స్కూల్‌కి వెళ్ళని చిన్నారుల వివరాలు కోరిన ఇండియన్‌ ఎంబసీ

- June 02, 2018 , by Maagulf

దోహా: ఇండియన్‌ ఎంబసీ, బారతీయ వలసదారులు స్కూలుకు వెళ్ళని తమ పిల్లల వివరాలు సమర్పించాలని కోరింది. ఆర్థిక సమస్యల కారణంగా చదువుకోలేకపోతున్నవారికి సహాయ సహకారాలు అందించే దిశగా ఇండియన్‌ ఎంబసీ ఈ చర్యలు చేపట్టింది. ఇండియన్‌ కమ్యూనిటీ పమెంబర్స్‌, పేద పిల్లలకు (భారతీయ వలసదారుల పిల్లలకు) సహాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు ఎంబసీ పేర్కొంది. స్టూడెంట్‌ పేరు, వయసు, క్యూ ఐడీ, గ్రేడ్‌ వంటి వివరాల్ని అలాగే ఇ-మెయిల్‌, మొబైల్‌, అడ్రస్‌, స్కూల్‌కి వెళ్ళకపోవడానికి కారణం తెలియజేస్తూ వివరాల్ని సమర్పించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com