'తేజ్ ఐ లవ్' యూ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల
- June 02, 2018
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో కరుణాకరన్ తెరకెక్కిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యూ. చిత్రంలో అనుపమ కథానాయికగా నటిస్తుంది. జూన్ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. శనివారం (జూన్ 2) తేజ్ ఐ లవ్ యూ చిత్ర నిర్మాతలు.. ఆర్జేస్ ( రెడియో జాకీ) వర్సెస్ తేజ్ ఐ లవ్ యూ టీమ్ క్రికెట్ పోటీ నిర్వహించి అందులో గెలిచిన వారి చేతుల మీదుగా అందమైన చందమామ అనే తొలి పాటని విడుదల చేయించారు. గోపిసుందర్ సమకూర్చిన బాణీలు సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తున్నాయి. అందమైన ప్రేమ కథా చిత్రంగా తేజ్ ఐ లవ్ యూ చిత్రం రూపొందింది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం కవితాత్మక భావనలతో సాగే ప్రేమ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో సాయిధరమ్ తేజ్ నవతరం ప్రేమికుడిగా కనిపించనున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మెమోరీ లాస్ పేషెంట్‌గా కనిపించనుందనే టాక్ . జూన్ 9న చిత్ర ఆడియో వేడుకని గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. మరి తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







