పాక్ పౌరుడు భారత్‌లోకి చొరబడి చేస్తున్న పనులు చూస్తే..

- June 02, 2018 , by Maagulf
పాక్ పౌరుడు భారత్‌లోకి చొరబడి చేస్తున్న పనులు చూస్తే..

పాకిస్థానీ పౌరుడు అక్రమంగా భారత్‌లోకి చొరబడి... ఏకంగా పాస్‌పోర్ట్‌ సంపాదించేశాడు... ఐదేళ్లుగా హైదరాబాద్‌లో మకాం వేసి దర్జాగా కాలం వెల్లదీస్తున్నాడు... ఇండియన్‌ ముస్లిం అని భావించి దుబాయ్‌లో ఉండగా పెళ్లి చేసుకున్న హైదరాబాదీ యువతి తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు సమాచారమందించింది... దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నివ్వరపోయే నిజాలు బయటపడ్డాయి... ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్‌ చేశారు...

నేపాల్‌ ద్వారా భారత్‌లోకి చొరబడిన మహమ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రాన్‌ నకిలీ సర్టిఫికెట్లతో పాస్‌పోర్ట్‌ పొందాడని గుర్తించిన పోలీసులు తీగ లాగారు... దీంతో నకిలీ సర్టిఫికెట్ల కొండే కదిలింది... కరీంనగర్‌లో నకిలీ సర్టిఫెకెట్ల తయారీ ముఠా వ్యవహారం బయటపడింది. ఈ ముఠా ఏకంగా నాలుగు వేలకు పైగా డూప్లికేట్‌ సర్టిఫెకెట్లను విక్రయించినట్టు తేలింది. 

కరీంనగర్‌లోని ట్రినిటీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న మక్సూద్‌ అహ్మద్‌ సులువుగా డబ్బు సంపాదించడానికి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం ప్రారంభించాడు. కిర్మాణి, ఖాజా నిజామ్‌లు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఐదారేళ్లుగా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు... నకిలీ సర్టిఫికెట్లు కావాలనేవారితో బేరసారాలు కుదుర్చుకొని సర్టిఫికెట్లు అందిస్తున్నారు... 

డబ్బులిస్తే దేశంలోని ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్‌ అయినా ఈ ముఠా చేతిలో పెడుతుంది... నకిలీ సర్టిఫికెట్ల ప్రధాన నిందితుడు మక్సూద్‌ అహ్మద్‌ నంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఒక్కో కోర్సు సర్టిఫికెట్‌కు ఒక్కో రేట్‌ ఫిక్స్ చేసి ఉండటం... పోలీసులను విస్మయానికి గురిచేసింది... డిగ్రీ, పీజీ, డిప్లమా ఇలా ఒకటేంటి విద్యార్హతలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను అందివ్వడంలో ఈ ముఠా ఆరితేరింది.

బీఏ సర్టిఫికెట్‌కు పన్నెండున్నర వేల నుంచి 15వేల వరకు, బీఎస్సీ, బీకాం సర్టిఫికెట్లు 13వేల నుంచి 21వేల వరకు ఈ ముఠా వసూలు చేస్తోంది. పీజీకీ సంబంధించి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్‌, ఎంబీఏ, ఎంసీఏ సర్టిఫికెట్లను దేశంలోని ఏ యూనివర్సిటీవైనా అందిస్తోంది... ఇందులో బీఈడీ సర్టిఫికెట్‌కు 50 వేల నుంచి 55వేల వరకు వసూలు చేస్తోంది... బీటెక్‌, ఎంటెక్‌ సర్టిఫికెట్లకైతే ఏకాంగా 75వేల నుంచి 85వేల వరకు వసూలు చేస్తున్నట్టు డైరీ ద్వారా తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com