జూన్ 12 న డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక భేటీ
- June 02, 2018
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌తో భేటీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు. ఈనెల 12న సింగపూర్‌లో తాను సమావేశమవుతున్నట్లు చెప్పారు. వైట్‌హౌస్‌లో ఉత్తరకొరియా దౌత్యవేత్త కిమ్ యోంగ్‌తో రెండు గంటలపాటు చర్చించిన ట్రంప్.. భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు రెండురోజులు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియోతో న్యూయార్క్‌లో చోల్ చర్చలు జరిపారు. తమ దేశాధ్యక్షుడు పంపిన లేఖను ట్రంప్‌కు అందజేశారు. వైట్‌హౌస్ నుంచి చోల్ వెళ్లిపోగానే ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. 12న సింగపూర్ వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఉత్తరకొరియా, అమెరికా మధ్య సంబంధాలు బలపడుతున్నాయని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ఈ సమావేశంతోనే అంతా అయిపోతుందని భావించడం లేదని, సానుకూల ఫలితం రావచ్చని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







