సెంట్రల్ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

- June 02, 2018 , by Maagulf
సెంట్రల్ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

ఉత్తర అమెరికాలోని మెక్సికోలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్లాక్స్‌క్లా రాష్ట్రంలో బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో పది మంది దుర్మరణం చెందగా, 11 మంది గాయపడ్డారు. ట్రక్కుకు బ్రేకులు ఫెయిలవ్వడంతో బస్సును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఎనిమిది మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com