నార్వే, స్విస్‌లో 'కాలా' ప్రదర్శనపై నిషేధం!
- June 02, 2018
ఒకవైపు కర్ణాటకలో 'కాలా' చిత్రాన్ని విడుదల కానివ్వమని అక్కడి ఫిలిం ఛాంబర్ తేల్చిచెబితే... మరోవైపు విదేశాల్లో సైతం ఈ చిత్రానికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తూత్తుకుడిలో పోలీసు కాల్పులను సమర్థిస్తూ, ఆందోళనకారులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ సూపర్‌స్టార్ రజనీకాంత్ విమర్శించటాన్ని ఖండిస్తూ, నార్వే, స్విట్జర్లాండ్‌లో 'కాలా' ప్రదర్శనపై నిషేధం విధించాలని అక్కడి తమిళ సినీ పంపిణీ దారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. 'కాలా' చిత్రాన్ని నార్వే, స్విట్జర్లాండ్‌లోని తమిళులెరవరూ చూడరని, ఈ పరిస్థితుల్లో ఆ చిత్రాన్ని ప్రదర్శించబోమని నార్వే తమిళ చిత్రాల పంపిణీదారుల సంఘం సభ్యుడు వశీకరన్ శివలింగం ఓ ప్రకటన జారీ చేశారు. ఇదే రీతిలో స్విట్జర్లాండ్‌లోని తమిళ సంస్థలు సైతం 'కాలా' చిత్రప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేయడంతో ఆ చిత్రం విడుదల కావటం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఈనెల 7వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో 'కాలా' విడుదల కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







