ఖతర్ ను హెచ్చరించిన సౌదీ
- June 02, 2018
సౌదీ అరేబియా, ఖతర్‌ల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త మిత్రుడు రష్యాతో మైత్రిని మరింత పటిష్ఠం చేసుకోవడంలో భాగంగా ఆ దేశం నుంచి ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సయిల్ సిస్టమ్ కొనుగోలు చేయాలని ఖతర్ భావిస్తోంది. ఈ ప్రయత్నాలు తెలుసుకున్న వెంటనే సౌదీ అరేబియా తీవ్రంగా స్పందించింది. ఖతర్ గనుక ఆ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే పక్షంలో ఆ దేశంపై దాడికి దిగుతామని హెచ్చరించింది. అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఖతర్ చేతిలో పడకుండా చూడాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కాన్‌కు సౌదీ రాజు లేఖ రాసినట్లు ఫ్రాన్స్ పత్రిక లె మోండే రాసింది. సౌదీతో పాటు యూఏఈ, బెహ్రయిన్ దేశాలు ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. తీవ్రవాదులకు అండగా నిలిచారన్న ఆరోపణలతో వీరు గత జూన్‌లో ఖతర్‌పై ఆర్థిక ఆంక్షులు కూడా విధించాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







