బిగ్ బ్రేకింగ్:ఫేస్బుక్ లో 'బగ్'..
- June 07, 2018
డేటా లీకేజి ఆరోపణలు, కేసులు, విచారణలతో మూడు నెలలుగా ఉక్కిరిబిక్కిరవుతున్న ఫేస్బుక్. మరో భారీ ఉపద్రవం నుంచి బయటపడుతోంది. ఫేస్బుక్ యూజర్లకు సంబంధించిన ప్రైవసీ సెట్టింగ్స్ లో 'బగ్' ను గుర్తించినట్టు ఫేస్బుక్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ ఎరిన్ ఈగన్ చెప్పారు. ఇది మే నెలలో 1.4 కోట్ల మంది యూజర్లును ప్రభావితం చేసిందని వెల్లడించారు. ఈ బగ్ ప్రభావంతో స్నేహితుతో లేదా ఎవరికివారే షేర్ చేసుకున్న పోస్టులు.. పబ్లిక్‌గా వెళ్లిపోయాయని అన్నారు. ఫేస్బుక్ యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్ మారుతున్నట్టు గుర్తించినట్లయితే వాటిని వెంటనే రీసెట్ చేసుకోవాలని కోరారు. అలా చేసుకొని పక్షంలో వారి పోస్టులు పబ్లిక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.అయితే బగ్ యాక్టివ్‌లో ఉన్న సమయంలో షేర్ చేసుకున్న పోస్టులకు మాత్రమే ఇది ప్రభావితమైందని గుర్తుచేశారు. యూజర్లు తమ పోస్టులు ప్రైవసీలో ఉన్నాయో లేదో సమీక్షించుకోవాలని ఎరిన్ సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







