ఇండియా:మరో రెండు రోజులు భారీ వర్షాలు..

- June 07, 2018 , by Maagulf
ఇండియా:మరో రెండు రోజులు భారీ వర్షాలు..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై జన జీవనం అస్థవ్యస్థమైంది. రోడ్లన్నీ మోకాలి లోతు నీళ్లతో నిండిపోయాయి. ఖర్, సియోన్, వొర్లి ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు నవీ ముంబై, పుణేలలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 8నుంచి 12వరకు చేపల వేటకు అరేబియా సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com