ముంజల పుడింగ్
- June 09, 2018
కావలసినవి:
ముంజలు- ఆరు, బియ్యం- ముప్పావు కప్పు, తాటిబెల్లం- కొద్దిగా, ఉప్పు- ఒక టీస్పూను, నీళ్లు- నాలుగున్నర కప్పులు, తాటిముంజల సిరప్- ఒకటిన్నర కప్పు. కొబ్బరి
క్రీముకోసం: కొబ్బరిపాలు- రెండు కప్పులు, చక్కెర- రెండు టేబేల్‌స్పూన్లు, ఉప్పు-అర టీస్పూను, కార్న్ స్టార్చ్- ఒక టేబుల్‌స్పూను.
తయారీవిధానం:
ముంజల మీదున్న పొట్టు తీసేసి సన్నటి ముక్కలుగా కోసుకోవాలి. గిన్నెలో నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో బియ్యం పోయాలి. ఉడుకుతున్న బియ్యంలో కొద్దిగా ఉప్పుతో పాటు తాటి బెల్లం, ముంజల సిరప్ వేయాలి. అన్నం పాయసంలా తయారువుతుంది.
కట్ చేసి పెట్టుకున్న ముంజల్ని అందులో వేసి చిక్కగా అవనివ్వాలి. క్రీము కోసం పెట్టుకున్న చక్కెర, ఉప్పు, కార్న్‌స్టార్చ్ కలిపిన నీళ్లను కొబ్బరిపాలల్లో పోసి బాగా గిలక్కొట్టాలి. వాటిని చిక్కగా అయ్యేదాకా మరగనివ్వాలి. ఇంకో వైపు అన్నం బాగా ఉడికి పుడింగ్‌లా తయారవుతుంది. ముంజలతో తయారైన ఈ తియ్యటి అన్నంపై క్రీము కోసం చేసిన చిక్కటి కొబ్బరిపాల మిశ్రమాన్ని పోయాలి. సువాసనలు వెదజల్లే ముంజల అన్నం పుడింగ్ రెడీ. ఈ పుడింగ్‌ను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..