తొలి 'జేమ్స్ బాండ్ గర్ల్' యూనిస్ గేసన్ ఇక లేరు!
- June 09, 2018మొట్టమొదటి జేమ్స్ బాండ్ 007 సినిమాలో హీరోయిన్‌గా నటించిన 'బాండ్ గర్ల్' యూనిస్ గేసన్ తన 90వ యేట కనుమూశారు. 1962లో రూపొందిన తొలి బాండ్ సినిమా 'డాక్టర్ నో'లో సీన్ కానరీ సరసన ఆమె సిల్వియా ట్రెంచ్‌గా నటించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సీన్ కానరీ - "బాండ్, జేమ్స్ బాండ్" - అనే బాగా ప్రాచుర్యం పొందిన డైలాగ్ చెప్పే సందర్భంగా ఆయనకు గేసన్ చాలా సహాయపడ్డారు. ఆమె అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో 'ఆమె లేని లోటు బాధాకరం' అని పేర్కొన్నారు.
"యూనిస్ గేసన్ మృతి చెందారని తెలిసి మేం ఎంతో విచారిస్తున్నాం. తొలి బాండ్ గర్ల్ యూనిస్ 'డాక్టర్ నో', 'ఫ్రమ్ రష్యా విత్ లవ్' సినిమాల్లో నటించారు" అని బాండ్ సిరీస్ నిర్మాతలు మైకేల్ జి విల్సన్, బార్బరా బ్రొక్కోలిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తొలి బాండ్ సినిమాలో సిల్వియా ట్రెంచ్‌గా నటించిన గేసన్ హాలీవుడ్ సినిమా చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు సినీ ప్రేమికుల నాలుకలపై నిలిచిన ఒక డైలాగ్‌ను సృష్టించడంలో తనదైన పాత్ర పోషించారు.
లీ సర్కిల్ క్లబ్ కసీనోలో 007ను కలిసిన సందర్భంగా ఆమె పందెం డబ్బును మరింత పెంచుదామని సూచిస్తారు. అప్పుడు బాండ్ - "నీ ధైర్యానికి నా జోహార్, మిస్, ....?" అని అంటారు. ఆప్పుడామె "ట్రెంచ్, సిల్వియా ట్రెంచ్. నీ అదృష్టానికి నా జోహార్ మిస్టర్... ?" అని ప్రశ్నిస్తుంది. "బాండ్, జేమ్స్ బాండ్."
అయితే 2012లో గేసన్ నాటి అనుభవాన్ని పంచుకుంటూ, తొలి బాండ్ సినిమాలో ఆ సన్నివేశాన్ని షూట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ పదాలను గంభీరంగా పలికేందుకు సీన్ కానరీ చాలా ఇబ్బంది పడ్డారు. ఆమె ఇలా అన్నారు: "ఆయన బాండ్, జేమ్స్ బాండ్ అనాలి. కానీ ఆయన వేర్వేరు కాంబినేషన్లు పలకసాగాడు. సీన్ బాండ్, జేమ్స్ కానరీ... 'కట్! కట్! కట్!'. ఆ తర్వాత డైరెక్టర్ టెరెన్స్ యంగ్ ఒత్తిడి మేరకు కానరీని ఆమె డ్రింక్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఆ డైలాగ్‌ను ఎంతో పర్‌ఫెక్ట్‌గా చెప్పేశారు. నిజానికి సిల్వియా ట్రెంచ్ పాత్ర కూడా బాండ్ పాత్ర లాగే అవిచ్ఛిన్నంగా కొనసాగాల్సింది. కానీ 'గోల్డ్ ఫింగర్' డైరెక్టర్ గయ్ హామిల్టన్ ఆ ఆలోచనకు స్వస్తి చెప్పారు. దాంతో 'సిల్వియా ట్రెంచ్' తెరమరుగైంది.
అయితే రెండు సినిమాల్లో బాండ్ గర్ల్‌గా నటించిన ఘనత మాత్రం గేసన్‌కే దక్కింది. 'డాక్టర్ నో' తర్వాత 'ఫ్రమ్ రష్యా విత్ లవ్' సినిమాలోనూ ఆమె సిల్వియా ట్రెంచ్ పాత్రలో నటించారు. కానీ ఆ రెండు సినిమాల్లోనూ గొంతు మాత్రం ఆమెది కాదు. ఆమె డైలాగుల్ని వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్ నిక్కీ వాన్ దెర్ జీల్‌తో చెప్పించారు. 1960, 1970 దశకాల్లో నిర్మించిన అనేక బాండ్ సినిమాల్లో బాండ్ గర్ల్ డైలాగుల్ని ఇలాగే ఇతరులతో చెప్పించారు.
1928లో సర్రేలో జన్మించిన గేసన్ బాండ్ గర్ల్‌గా నటించడానికి ముందు కొన్ని సినిమాల్లో నటించారు. వాటిలో 1958లో విడుదలైన 'ద రివెంజ్ ఆఫ్ ఫ్రాంకెన్‌స్టైన్' ఒకటి. బాండ్ సినిమాల తర్వాత ఆమె 'ద సెయింట్ అండ్ ది యావెంజర్స్' అనేక క్లాసిక్ టీవీ సిరీస్‌ల్లో నటించారు.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!