తలనొప్పి, నిద్రలేమిని తరిమేందుకు ఖర్చు లేని కష్టం లేని ఈ ఒక్క ప్రయోగం

- June 09, 2018 , by Maagulf
తలనొప్పి, నిద్రలేమిని తరిమేందుకు ఖర్చు లేని కష్టం లేని ఈ ఒక్క ప్రయోగం

తలనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే శరీరంలో మెగ్నీషియం శాతం బాగా లోపించి ఉండవచ్చు. తగినంత మెగ్నీషియం శరీరానికి చాలా శక్తినిస్తుంది. ఇది శరీరంలో సరిపడినంత లేనపుడు కణాల్లో కాల్షియం శాతం పెరుగుతుంది. ఫలితంగా ప్రధానమైన హార్మోన్లు, న్యూట్రోట్రాన్సిమిటర్స్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కొంత సమయం తర్వాత రక్తనాళాలు బాగా ముడుచుకుపోయి తలనొప్పి ప్రారంభమవుతుంది.  
 
మెగ్నీషియం పరిమాణం బాగా తక్కువైతే బ్రెయిన్ యాక్టివిటీ కూడా ఎక్కువవుతుంది. దానివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మెగ్నీషియం పుష్కలంగా ఉండే పదార్థాలని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామిడిపళ్ళు, తోటకూర, గసగసాలు, ద్రాక్ష, చేపలు, బంగాళాదుంపలు, అన్ని రకాల చిరుధాన్యాలు తప్పకుండా తినాలి. అప్పుడు తలనొప్పికాదు, నిద్రలేమితో బాధపడుతున్నా, ఆ బాధ నుంచి సులభంగా బయటపడుతారు. 
 
తలనొప్పి తైలము
కుప్పింటాకు రసము ఒక కేజీ (నీళ్ళు కలపకుండా తీసినది), మంచి నువ్వుల నూనె ఒక కేజీ, ఈ రెండింటినీ ఒక పాత్రలో కలిపి పొయ్యి మీద పెట్టి చిన్న మంటపైన నిదానముగా ఆకు రసమంతా ఇగిరిపోయి నూనె మిగిలేవరకూ మరిగించాలి. తరువాత, పాత్రను దించి చల్లార్చిన తరువాత కొంచెం వడపోసుకుని ఈ తైలమును కొంచెం గోరువెచ్చగా తలకు రుద్దుకుని స్నానము చేస్తూ ఉంటే తలపోటు, తలదిమ్ము త్వరగా తగ్గిపోతాయి. 
 
పార్శ్వపు తలనొప్పికి : రాత్రి నిద్రపోయేముందు 60 గ్రాముల కండ చక్కెర పొడి పావులీటరు నీటిలో వేసి కరిగించి మూతపెట్టి పక్కన పెట్టుకొని పడుకోవాలి. తెల్లవారు ఝామున 5 గంటలకు నిద్రలేచి ఆ పంచదార నీళ్ళని ఒకసారి కలుపుకుని తాగాలి. తర్వాత ఒక గంటవరకూ మరేమీ తాగకూడదు, తినకూడదు. ఈవిధంగా నాలుగు నుంచి ఐదు రోజులు చేస్తే పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది.
 
తలరోగాలకు (తలనొప్పి) : రోజూ ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నువ్వుల నూనె రెండు చుక్కలు చెవులలోనూ రెండుచుక్కలు ముక్కులలోనూ వేయాలి. గుక్కెడు నూనెను నోటిలోనూ వేసుకుని ఐదు నిమిషాలు పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల ఈ తైలం తలలోని సర్వ శిరో భాగాలకు చేరి మలిన, వ్యర్ధ పదార్థాలు, మలిన వాయువులు, ఉష్ణ వాయువులు నిలువ వుండకుండా వాటిని కరిగిస్తూ శిరస్సును పరిశుభ్రంగా ఉంచుతుంది. ఖర్చు లేని కష్టం లేని ఈ ఒక్క సులువైన ప్రయోగంతో భవిష్యత్తులో రక్తపోటు, గుండెపోటు, పక్షపాతం, మూర్ఛ, అపస్మారము, కండరాలక్షయం మొదలైన నరాల సంబంధిత రోగాలు దరి చేరకుండా తమను తాము కాపాడుకోవచ్చు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com