భోజనం చేతితో తినటం వల్ల కలిగే ఉపయోగాలు:

- May 07, 2015 , by Maagulf
భోజనం చేతితో తినటం వల్ల కలిగే ఉపయోగాలు:

భోజనం చేతితో తినటం వల్ల కలిగే ఉపయోగాలు:

 

మనలో చాలా మంది భోజనం చితితో తినటం అనారోగ్యకరమనీ అసహ్యకరమనీ భావిస్తుంటారు. కానీ సాంప్రదాయ భోజన పధ్ధతి కేవలం శరీరంతోనే కాకుండా మనస్సు, బుద్ధి, ఆత్మతో కూడుకున్నది కూడా!

ప్రస్తుతం చాలామంది తమ పిల్లలకి చేతితో భోజనం చేయటాన్ని అలవాటు చేయటం అభినందించ దగిన విషయం. అలా చేయటం వల్ల ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం.

  • యోగా మరియు చాలా సాంప్రదాయ నృత్యాలలో చూసినట్లుగా భోజనం చేసే సమయంలో మన చేతులు కొన్ని ముద్రలుగా మారుతాయి. ఆ ముద్రలని బట్టి ఆహారములోకి చేరే శక్తీ మారుతుంది.
  • మన చేతి మరియు కాలి వేళ్ళు ఈ ప్రకృతిలోని పంచభూతాల శక్తిని కలిగి ఉంటాయని వైదిక ధర్మాలు తెలియజేస్తున్నాయి.

బొటన వేలు - అగ్ని

చూపుడు వేలు - వాయువు

మధ్య వేలు - ఆకాశం

అనామిక వేలు - భూమి

చిటికిన వేలు – నీరు

  • మనం భుజించబోవు ఆహారాన్ని ఈ వేళ్ళు పచనయోగ్యంగా మన జీర్ణాశయానికి చేరకముందే తయారు చేస్తాయి. చక్కటి రుచి, రంగు, వాసనతో కూడిన భోజనం మనసుని ఆహ్లాద పరచటంతో పాటు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
  • మన వేళ్ళ చర్మము ఆహారపు వేడిని, మెత్తని లేదా కారుకు దనాన్ని, ద్రవ/ఘన పదార్ధమా అన్న విషయాలని మెదడుకి చేరవేస్తుంది. దానిని బట్టి అవసరమైన పచన ఆమ్లాలు వేడుదల అవుతాయి.
  • ముందుగా ఆహారపు వేడి తెలిస్తే నోరు కాలకుండా జాగ్రత్త పడగలము కదా!
  • అన్ని ధర్మాలు/మతాలు నమ్మే విషయం ఏంటంటే చేతులు ఎనెర్జెటిక్ క్లెన్సర్స్ గా పని చేస్తాయని. అందుకే భిజనానికి ముందు పదార్ధాలపై చేతులు ఉంచి ప్రార్ధనలు చేస్తారు.
  • అలా చేతులు ఉంచటం ద్వారా, లేదా భోజనాన్ని నోట్లో పెట్టుకునే కన్నా ముందు చేతిలోకి తీసుకోవడం ద్వారా ఆహారంలోకి వివిధ వ్యక్తుల ద్వారా అనగా ఆహార పదార్ధాలు/ కూరగాయలు అమ్మేవారు లేదా వండేవారి ద్వారా చేరే భావాలతో, ఉద్వేగాలతో, ఆలోచనలతో కూడిన భావశక్తిని నిర్మూలించి, ఆహార పదార్ధాలని శుభ్రపరచి వాటి ప్రభావాన్ని బుద్ధి/ఆత్మ మీద పడకుండా చేస్తాయి. దాని వల్ల మానసికమైన ఒత్తిడికి దూరమవుతాం.
  • కొన్ని బ్యాక్టీరియాలు అనగా నార్మల్ ఫ్లోరా వంటివి ముఖ్యంగా చేతులపై/చర్మంపై ఉంటాయి. ఇవి మనకు హాని కలిగించవు సరికదా బయటనుండి వచ్చే బ్యాక్టీరియా నుండి మనలను కాపాడతాయి.
  • చేతులపై ఉండే బ్యాక్టీరియాకి బయట నుండి వచ్చే బ్యాక్టీరియా నుండి రక్షించబడే శక్తి అనుసంధానమై ఉన్నందువల్ల జీర్ణాశయం లోపల కలిగే ఇబ్బందులు స్పూనుతో తినే అలవాటు ఉన్నవారికన్నా తక్కువ.
  • చాలావరకు సనాతన ధర్మంలో చేయమని వివరించిన విషయాలు కొంత విడ్డూరంగా అనిపించినా వాటి వెనుక ఉన్న శాస్త్రపరమైన జ్ఞానం అలౌకిక విషయాలకి సంబంధించిన విషయాలని తెలుసుకుంటే ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది.

 

--శ్రీ వీణ,దుబాయ్,యుఏఈ 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com