గత జీవితం
- May 07, 2015
గత జీవితమెంత ఘనమైనది
ధనమున్న పర్వము
సార్వభౌముల మన్న గర్వము!
జ్ఞాపకాల విలువతో
జ్ఞానోదయం కలిగించి
బ్రతుకు బాటలో
గతుకులెన్నో లెక్కకట్టి
గుర్తు తెచ్చుకునే గత జీవితం
నిజంగా ఘనమైనది
గౌరవమైనది గొప్ప ఘాటైనది!
బరువైన జీవితం విలువెంతని అడిగితే
పెరిగిన ఇంటి పోరుతో
తరగని రక్త పోటుతో
పరుగులెత్తే రూపాయి వెనుక
తరుము కుంటూ పరుగెత్తి
ఓడిపోయిన పోటీతో
అరిగిపోయిన చెప్పులాంటి జీవితం!
అనుభవాలతో అనుభూతులతో
అమ్మో చెప్పలేని గొప్ప జీవితం
చల్లారిపోయిన కాఫీ కప్పులాంటి జీవితం
నా గత జీవితం ఘనమైన జీవితం
చరిత్ర రాసి చివర సంతకం లేని కాగితం
అంతు దొరకని అనామకుడి భాగోతం
అందరికి వినపడని అదోలాంటి సుప్రభాతం!
---- డా|| కోడి రామ, అలైన్, యు ఏ యి.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







