కొత్త రెసిడెన్సీ పర్మిట్ కార్డ్ సమాచారం
- December 10, 2015
కొత్త రెసిడెన్సీ పర్మిట్ కార్డ్ ఇకపై ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఉపయోగపడున్న నేపథ్యంలో విదేశీ పౌరులు తమ వెంట ఆ కార్డ్‌ని నిత్యం ఉంచుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు, విదేశాల నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఈ ఐడెంటిటీ కార్డుని తప్పక చూపాల్సి ఉంటుంది. కొందరు విదేశాలకు వెళ్ళి, తిరిగొచ్చేటప్పుడు తమతో కార్డ్‌ని తీసుకురాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్డు లేకుండా, ఆరు నెలలకు మించకుండా విదేశాలకు వెళ్ళి, తిరిగొచ్చేవారికి రిటర్న్ వీసా ద్వారా ప్రవేశం కల్పిస్తారు. వారి రెసిడెన్సీ కార్డ్‌ని 'ఇమ్మిగ్రేషన్ సిస్టమ్'లో 'లాస్ట్'గా నమోదు చేస్తారు. ఆరు నెలలకు మించి, విదేశాల్లో ఉండి కార్డు లేకుండా తిరిగి వచ్చేవారు, ఇకపై ఇలాంటి తప్పిదం జరగదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇమ్మిగ్రేషన్‌లో 'లాస్ట్'గా ఆ కార్డ్‌ని నమోదు చేస్తారు. స్పాన్సరర్ లేదా ఎంప్లాయర్ ద్వారా రిటర్న్ వీసా ప్రాసెస్ జరగని పక్షంలో, రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా భావించి, చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు. ఈ ఇబ్బందులు తలెత్తనున్న కారణంగా, రెసిడెన్సీ కార్డ్‌ని తప్పనిసరిగా తమ వెంట ఉంచుకోవడం మంచిది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







