తీవ్రవాదానికి మతంతో సంబంధం లేదు
- December 10, 2015
ప్రపంచంలోని అన్ని దేశాలూ తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు తమవంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. రియాద్‌లో జరుగుతున్న 36వ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్‌తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిసిసి సభ్య దేశాలతో తాము ఎప్పుడూ సన్నిహిత సంబంధాలనే కోరుకుంటామని చెప్పారాయన. 1981లో జిసిసి ఏర్పాటయ్యింది. ఇందులో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. జిసిసి సభ్యదేశాలన్నీ తమకు ఉమ్మడి శతృవులుగా పరిణమిస్తున్న తీవ్రవాదం తదితర అంశాలను భావించాల్సి ఉంటుందని, అభివృద్ధిలో అందరం కలిసి ముందడుగు వేయాలని కింగ్ సల్మాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సంక్షోభంలో ఉన్న యెమన్ని ఆదుకోవడం జిసిసి దేశాలు బాద్యతగా తీసుకున్నాయని ఆయన చెప్పారు. సిరియాలో తీవ్రవాదం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, అక్కడి ప్రభుత్వానికి అండగా ఉండాలని కింగ్ సల్మాన్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







