భారీ దాడికి ప్రణాళికలు ..
- December 10, 2015ప్రభుత్వ భవనాన్ని టార్గెట్ చేసుకుని భారీ దాడికి ప్రణాళికలు రచించిన కేసులో ఓ పదిహేనేళ్ల కుర్రాడిని, 20 ఏళ్ల యువకుడిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడిని హత్య చేయాలనుకున్న ఘటనకు సంబంధించి పదిహేనుమందిని అరెస్టు చేసిన సందర్భంగా పోలీసులు విచారణ చేసినప్పుడు తాజా కుట్రకు సంబంధించిన వివరాలు తెలిశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం తాజాగా రైడింగ్ లు నిర్వహించి ఆ 15 ఏళ్ల బాలుడిని, 20 ఏళ్ల వ్యక్తిని ఇంట్లో ఉండగానే అరెస్టు చేశారు. అనంతరం వాళ్ల నివాసాలను జప్తు చేశారు. ఈ అరెస్టులకు సంబంధించి ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు డిప్యూటీ కమిషనర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ మైఖెల్ పెలాన్ మాట్లాడుతూ తాజా అరెస్టులు ప్రభుత్వ కార్యాలయంపైనే దాడి చేసేందుకు రచించిన భారీ కుట్రకు సంబంధించినవని అన్నారు. అంతకుముందే ముగ్గురుని అరెస్టు చేశామని వారికి కొత్తగా అరెస్టు చేసినవారికి సంబంధాలు ఉండిఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. డిసెంబర్లోనే ఈ కుట్ర అమలు చేయాలని వారు ప్లాన్ చేశారని, ఈలోగా తమ నిఘా వర్గాలు చాలా వేగంగా స్పందించి భగ్నం చేసి వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు ఉగ్రవాదంపై తాము చాలా సీరియస్ గా ఉన్నామని, ఉగ్రవాద కుట్రలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







