అమెరికా:వ్యభిచారంలో పాల్గొన్న ఆరుగురు హీరోయిన్లు..
- June 19, 2018
రంగుల ప్రపంచాన్ని చికాగో సెక్స్ రాకెట్ వణికిస్తోంది. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ వివాదంతో వీధిన పడ్డ తెలుగు సినీ ఇండస్ట్రీ... చికాగో వ్యవహారంతో మరింత పరువు తీసుకుంది. అందుకు కారణం ఈ రాకెట్లో ప్రధాన నిందితులుగా ఉన్నది ఇద్దరు తెలుగు దంపతులే కావడం. దీంతో ఎవరి పేర్లు బయటపడతాయోనని హీరోయిన్లు, యాంకర్లు భయపడుతుంటే.. మాహిళా సంఘాలు వాళ్ళకు బాసటగా నిలుస్తామంటున్నాయి.
మొన్న కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు సెక్స్ రాకెట్.. వరుస వివాదాలతో టాలీవుడ్ షేక్ అవుతోంది. అమెరికాలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ తెలుగు తారలను హడలెత్తిస్తోంది. ఇన్ని రోజులు అమెరికాలో ఈవెంట్ అంటే.. ఎగిరి గంతేసే తారలు.. ఇప్పుడు ఆ దేశం పేరు చెబితేనే భయపడుతున్నారు. సెక్స్ రాకెట్ ఎపిసోడ్ తరువాత అక్కడి అధికారులు నిఘా పటిష్టం చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ అంటే చాలు.. సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్నా లేకున్నా.. గంటల కొద్ది కూర్చోబెట్టి.. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అమెరికాలో టాలీవుడ్ నటీనటులతో బాగోతం నడిపించింది తెలుగువారే కావటంతో టాలీవుడ్ లో దుమారం రేపుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన మహిళా సంఘాలు ఈ సెక్స్ రాకెట్ వెనక ఉన్న పెద్దల గుట్టు కూడా తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
కిషన్ దంపతుల ఇంట్లో దొరికిన ఆధారాలతో... ఆరుగురు హీరోయిన్లు వ్యభిచారంలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. కాల్‌డేటా విశ్లేషిస్తున్న పోలీసులు.. మరింత మంది బాధితుల పేర్లు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు, విటులను అధికారులు విచారించారు. వారందరూ అప్రూవర్లు మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో.. చార్జిషీటులో వారిని సాక్షులుగా పేర్కొనే అవకాశం ఉంది. గురువారం జరిగే విచారణలో దీనిపై క్లారిటీ రానుంది.
విచారణ జరుగుతున్న కొద్ది షికాగో సెక్స్ రాకెట్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈవెంట్స్ పేరుతో వచ్చిన హీరోయిన్లని షాపింగ్ అనే కోడ్ భాషలో పిలుస్తారని తెలుస్తోంది. అసలింతకీ అమెరికాలో సెక్స్ రాకెట్ ఎలా బయటకు వచ్చిందో తెలిస్తే.. అందరూ షాక్ అవ్వకమానరు. ఓ చిత్తు కాగితమే.. సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసింది. సెక్స్ రాకెట్ సూత్రధారులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళను వీసా కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు...వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో.. హోటల్ మారియట్ పేరుతో ఉన్న పేపర్ రాకెట్ గుట్టు రట్టు చేసింది. దానిపై ఒకచోట వాషింగ్టన్ డీసీ, దాని పక్కనే సినీ హీరోయిన్ల పేర్లు, రూమ్ నంబర్లు చేతి రాతతో ఉంది. ఇలా చాలా మంది పేర్లు.. గదుల నంబర్లు ఉండటంతో.. వ్యభిచార ముఠాగా పోలీసులు అనుమానించారు. ఫిబ్రవరి 16న కిషన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా కండోమ్స్, 5డైరీలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో లభ్యమైన వివరాల ఆధారంగా.. పలువురు నటీమణులను పోలీసులు విచారించారు. ఆరుగురు వ్యభిచారానికి పాల్పడినట్లు గుర్తించారు.
సెక్స్ రాకెట్ సూత్రధారులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రకళ భవితవ్యం ఈనెల 21న తేలనుంది. మోదుగుమూడి దంపతుల ఇంటరాగేషన్ తర్వాత.. అధికారులు 42పేజీల క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







