సౌదీ అరేబియా :తండ్రిని హతమార్చిన కేసులో దోషికి మరణ శిక్ష

- June 26, 2018 , by Maagulf
సౌదీ అరేబియా :తండ్రిని హతమార్చిన కేసులో దోషికి మరణ శిక్ష

సౌదీ అరేబియా :తండ్రిని సజీవ దహనం చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించినట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది. సౌదీ జాతీయుడైన మనాహి అల్‌ బురూక్‌ అల్‌ బిషి, అతని తండ్రిపై గ్యాసోలైన్‌ని పోసి నిప్పంటించాడు. నిద్రిస్తున్న తండ్రి, ఆ నిద్రలోనే హాహాకారాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనే ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. సుప్రీంకోర్టుకి నిందితుడ్ని తరలించగా, అక్కడా అతనే నేరం చేసినట్లు రుజువయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి మరణ శిక్ష విధించడమయ్యింది. ఈ నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం విధించిన మరణ శిక్షను అమలుపరిచారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు ఉరిశిక్ష విధించడం ద్వారా చెక్‌ పెట్టగలమని అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com