నటుడు కెప్టెన్ రాజుకి గుండెపోటు: ఒమన్‌లో చికిత్స
- June 26, 2018
మస్కట్: ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అమెరికా వెళుతుండగా, మార్గమధ్యంలో గుండెపోటుకు గురైన రాజుని, ఒమన్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మస్కట్ విమానాశ్రయంలో రాజు ప్రయాణిస్తున్న విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం కెప్టెన్ రాజుకి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందుతోందనీ, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సుమారు 500 సినిమాల్లో కెప్టెన్ రాజు నటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటుడిగా కెప్టెన్ రాజు పనిచేశారు. అంతకు ముందు ఆయన మిలిటరీలో సేవలు అందించారు. ఆర్మీ అధికారిగా పనిచేసి, ఆ తర్వాత సినిమాల్లోకొచ్చారు కెప్టెన్ రాజు. ఎక్కువగా విలన్ పాత్రల్లో కెప్టెన్ రాజు నటించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







