దోమకొండ గడికోటపై హీరో రామ్ చరణ్ తేజ ఆసక్తి..

- December 11, 2015 , by Maagulf
దోమకొండ గడికోటపై హీరో రామ్ చరణ్ తేజ ఆసక్తి..

నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడికోటపై హీరో రామ్ చరణ్ తేజ ఆసక్తి చూపించారు. గడికోటలోని మహాదేవుని ఆలయంలో జరిగిన మహారుద్ర శత చండీ యాగంలో గురువారం సతీమణి ఉపాసనతో పాటు పాల్గొన్న ఆయన కోటలో అందాలను, కట్టడాలను తిలకించారు. వీటికి సంబంధించిన వివరాలను గైడ్ ను అడిగి తెలుసుకున్నారు. హీరో రాంచరణ్ తేజ కోటకు వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెర్రీ.. చెర్రీ.. అని నినాదాలు చేశారు. ఈ సందర్భం గా అభిమానులకు హీరో హాయ్ అంటూ పలకరించారు. పోలీసులు, ప్రైవేటు సిబ్బంది బందోబస్తు చేపట్టారు. ఉమాపతి రావు, అనిల్, రాంచరణ్ తేజ 16 సైకిల్ రిక్షాలను పంపిణీ చేశారు. దోమకొండ గ్రామంలోని 16 వార్డుల్లో రోడ్లు శుభ్రంగా ఉంచేందుకు వీటిని అందజేసినట్లు రామ్ చరణ్ తేజ చెప్పారు. గతంలో ఆటో ట్రాలీ రిక్షాను మామయ్య కామినేని అనిల్ సహకారంతో అందించామని చెప్పారు. కోటలో భవనాలకు మరమ్మతు పనులు పూర్తి అ య్యాయని సిబ్బంది తెలిపారు. రెండు నెలలు తర్వాత భవనాలను హీరో రాంచరణ్ తిరిగి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో రాంచరణ్‌ తేజను దోమకొండ గ్రామస్తులు సన్మానిం చారు. గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, మాజీ సర్పంచి ఐరేని నర్సయ్య, అనంతరెడ్డి, నల్ల పు శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, సాయబుగారి రాజు మధుసూదన్‌రెడ్డి, షమ్మీ, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com