హస్కా ప్రావిన్స్ లో ఐఎస్ఐఎస్ మారణహోమం..
- December 11, 2015
సిరియా ఈశాన్య ప్రాంతంలో హస్కా ప్రావిన్స్ లో తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మారణహోమం సృష్టించింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని ట్రక్కు బాంబులు పేల్చింది. ఈ ఘటనలో 60 మందికిపైగా మరణించారు. మరో 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ మేరకు కుర్దిష్ మిలటరీకి చెందిన ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. హస్కా పట్టణంలోని ఆసుపత్రి, మార్కెట్ వద్ద శుక్రవారం ఈ దాడులు జరగగా... మరోకటి గురువారం ఆర్థరాత్రి టెల్ టమర్ పట్టణంలోని నివాస ప్రాంతాల సమీపంలో ఈ ట్రక్కు పేలుడు సంభవించిందని చెప్పారు. సిరియాలోని యూఎస్ సంకీర్ణ దళాలకు స్థానిక కుర్ధిష్ మిలటరీ సహకారం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ ఈ దాడికి తెగబడిందని ఉన్నతాధికారి వివరించారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







