బిగ్ బాస్ లో అలరించనున్న హెబ్బా
- July 14, 2018
బిగ్ బాస్ సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా రసవత్తరంగా సాగుతుంది. వారానికొకరు ఎలిమినేషన్ అవుతున్న ఈ సందర్భంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలకు పంపించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్-2లో ప్రస్తుతం సామ్రాట్, తేజశ్వి.. తనీష్ దీప్తి సునైనాల జంటలు అలరిస్తున్నాయి.
అయితే ఈమధ్య తేజశ్వి వ్యవహారం సామ్రాట్, తనీష్ లకు కూడా నచ్చట్లేదు. ముఖ్యంగా తనీష్, తేజశ్విల మధ్య గొడవ మొదలైంది. అందుకే ఇంట్లోకి ఓ కొత్త భామను తీసుకొచ్చే పనిలో పడ్డారట నిర్వాహకులు. కాస్త చప్పగా సాగుతున్న బిగ్ బాస్ ఎపిసోడ్స్ ను వేడెక్కించేందుకు హెబ్భా పటేల్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌజ్ లోకి పంపిస్తున్నారట.
అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా.. కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హెబ్భా ఆ సినిమాతో కుర్రకారు ఉర్రూతలూగించేలా చేసింది. ఆ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలు హెబ్భా ఒకేరకమైన సినిమాలతో అలరించింది. ఇక బిగ్ బాస్ లో ఆమె ఎంట్రీ సర్ ప్రైజ్ కానుంది.
సినిమాలో తన హాట్ లుక్స్ తో అదరగొడుతున్న హెబ్భా పటేల్ బిగ్ బాస్ లో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. ప్రస్తుతం హెబ్భా పటేల్ 24 కిస్సెస్ సినిమాతో వస్తుంది. ఆదిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్భా పటేల్ కిస్సులతో కిక్ ఇస్తుందని అంటున్నారు. మరి బిగ్ బాస్ హెబ్భా ఎంట్రీ పై వస్తున్న వార్తలపై నిజమెంత ఉందన్నది చూడాలి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







