27న బ్లడ్ మూన్.. సంపూర్ణ చంద్రగ్రహణం

- July 14, 2018 , by Maagulf
27న బ్లడ్ మూన్.. సంపూర్ణ చంద్రగ్రహణం

దేశంలో ఈ నెల 27న ఈ శతాబ్ధంలోనే అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు. 2000 సంవత్సరం జులై 16న ఒక గంటా 46 నిమిషాలు, 2011 జూన్‌ 15న 1:40 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 27వ తేదీ అర్థరాత్రి సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతం కానుంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ గ్రహణం 1:43 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇది చాలా అద్భుతమైన దృశ్యమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.
జూలై 27న రాత్రి 11:45 నిమిషాలకు గ్రహణం పట్టనుంది. అర్ధరాత్రి దాటాక ఒంటిగంటకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెల్లవారుజామున 2:43 గంటల వరకు ఇది కొనసాగుతుంది. 3:49 గంటల వరకు పాక్షిక చంద్ర గ్రహణాన్ని చూడవచ్చని తెలిపింది.

ఇకపోతే.. ఖగోళ పరంగా సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్య మీదకు వచ్చినప్పుడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నా చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరుగుతుంటాడు.

సూర్యచంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజు పూర్ణిమ. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్ద, కేతువు వద్ద గానీ ఉంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్తిగా చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ, కొంత భాగమే కనిపిస్తే దాన్ని పాక్షిక చంద్రగ్రహణమని అంటారు. ఈ సందర్భంగా చంద్రుడిపై పడే కిరణాలు భిన్న రంగుల్లో మారి ఎరుపు, నీలం రంగులో దర్శనమిస్తాయి. దీన్ని బ్లడ్ మూన్ అంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com