'సంజూ' నాకూ నచ్చాడు.. వీడియో వైరల్
- July 18, 2018
బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ బయోపిక్ 'సంజూ'గా తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సాపీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. కాగా ఈ చిత్రంలోని 'మై బడియా తూ భీ బడియా' అనే పాటకు ముద్దొచ్చే ఓ బుజ్జి బంగారు చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. స్కూల్‌కి వెళ్లొచ్చి బ్యాగ్ పక్కన పడేసింది. డ్రస్ మార్చుకో బంగారూ అని అమ్మ వారిస్తున్నా వినకుండా టీవీలో అప్పుడే వస్తున్న సంజూ సినిమాలోని పాటకు పదం కదిపింది. చిట్టి తల్లి డ్యాన్స్ చూసిన అమ్మకు నోట మాట రాలేదు. ఫోన్ తీసుకుని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమ్మతో పాటు మనం కూడా ఫిదా అవ్వాల్సిందే ముద్దులొలికే ఈ చిన్నారి స్టెప్స్‌కి. మరి మీరు కూడా చూసి ఆనందించేయండి.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







