రూ.700 కోట్ల చిత్రం అట్టర్ ప్లాప్..
- July 18, 2018
చైనా సినిమా ఇండస్ట్రీకి చెందిన రూ.700 కోట్ల భారీ చిత్రం అట్టర్ ప్లాప్ అయింది. థియేటర్ లలో ప్రేక్షకులు లేక వెల వెల బోయాయి. టిబెటన్ బుద్దిస్ట్‌ల పౌరాణిక కథల నేపథ్యంలో చైనా నిర్మాణ సంస్థ అలీబాబా పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం 'అసుర' చైనా చలనచిత్ర పరిశ్రమలోనే ఖరీదైన చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. అయితే నాలుగు రోజులకే ఇదే సినిమా అత్యంత చెత్త రికార్డు నమోదుచేసింది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వారంరోజులు కూడా పూర్తి కాకుండానే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 113 మిలియన్ డాలర్ల ఖర్చుతో తెరకెక్కిన అసుర కేవలం 7.3 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సినిమాను మంగళవారం రాత్రినుంచే థియేటర్ నుంచి తీసేశారు. అసుర ప్లాప్ తో చైనా సినీ పరిశ్రమ షాక్ లో మునిగిపోయింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







